పోలీసుల పేరుతో వసూళ్లు… నిందితుడు అరెస్ట్
మహబూబాబాద్ జిల్లా కురవిలో పోలీసులమని చెప్పి డబ్బులు వసూలు చేసిన ఎర్పుల నాగరాజును ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. పులిచింతల శ్రీనివాస్ నుంచి రూ. 22,300 దోచుకున్నాడు. మహాశివరాత్రి జాతరలో బెదిరించి క్యాష్, ఫోన్‌పే ద్వారా డబ్బులు తీసుకున్నాడు. ప్రేమికులను టార్గెట్ చేసి బ్లాక్‌మెయిల్ చేసిన చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు.