ఆవులను తరలిస్తున్న కంటైనర్ పట్టివేత
NLG: చట్టవిరుద్ధంగా తరలిస్తున్న దాదాపు 20 ఆవుల కంటైనర్‌ను భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పానగల్ వద్ద అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్సై సైదులు, వెటర్నరీ డాక్టర్ సందీప్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని గోవులను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేయాలని కోరుతూ కార్యకర్తలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.