'సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపరాదు'

VZM: రాజాం సీఐ అశోక్ కుమార్ ఆద్వర్యంలో శనివారం పోలీసు సిబ్బంది స్దానిక అంబేద్కర్ సెంటర్లో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలను ఇవ్వవద్దని సూచించారు. సరైన పత్రాలు లేకుండా, నంబర్ ప్లేట్లు లేకుండా రోడ్డుపై వాహనాలు నడిపిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.