'మత్స్యకారులకు ప్రభుత్వం తరఫున మద్దతు ఇస్తాం'
KMM: కామేపల్లి మండలం పాత లింగాల గ్రామంలోని మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మత్స్య సహకార సంఘాల ఆర్థికాభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందని రాంరెడ్డి గోపాల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తరఫున మద్దతు ఇస్తామన్నారు.