అయ్యప్పస్వామి దర్శనానికి 12 గంటలు
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్పస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24 వరకు వర్చువల్ క్యూ ద్వారా 70 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మందికిి మాత్రమే అనుమతి ఇవ్వనుంది. దర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ పాస్ తప్పనిసరి చేసింది.