ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి

కృష్ణా: గుడివాడలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అబు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీమంత్రి కొడాలి నాని బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తారని, మత సామరస్యానికి పవిత్ర రంజాన్ మాసం ప్రతీక అని అన్నారు. హిందువులు, ముస్లింలు అన్నదమ్ములాగా కలిసి ఉండాలన్నారు.