బదిలీపై వెళ్తున్న బీట్ అధికారికి ఆత్మీయ సత్కారం

JGL: మేడిపల్లి మండలం గోవిందారం అటవీ సెక్షన్ బీట్ అధికారిగా గత దశాబ్ద కాలంగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న అటవీ శాఖ అధికారి గాండ్ల మధుసూదన్ కు ఆత్మీయ సత్కారం చేసారు. మండలంలోని రాజలింగంపేట గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో మధుసూదన్‌ను ఘనంగా సత్కరించారు. అడవి సంపదను కాపాడడంలో మధుసూధన్ చేసిన కృషిని కొనియాడారు.