VIDEO: కల్లూరులో మధ్యాహ్నం లోపు తుది ఫలితాలు..!
KMM: కల్లూరులోని 20 వార్డులకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. లెక్కింపు కేంద్రంలో సిబ్బంది వార్డుల వారీగా బ్యాలెట్ ఓట్లను వేరు చేస్తూ వేగంగా లెక్కింపును కొనసాగిస్తున్నారు. సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కౌంటింగ్ హాల్‌ను సందర్శించి ప్రక్రియను పరిశీలించారు.