నేటి నుంచి 23 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేటి నుంచి 23 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: ప్రత్తిపాడు 220 KV ఉపకేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి 23వ తేదీ వరకు తెనాలి సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని ఈఈ చిరంజీవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.