జనసేనలో చేరిన 250 మంది వైసీపీ కార్యకర్తలు
W.G: తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలకు చెందిన 250 మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.