ఇంద్రకీలాద్రిపై ఎస్కలేటర్‌తో తంటా..!

ఇంద్రకీలాద్రిపై ఎస్కలేటర్‌తో తంటా..!

NTR: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయం చిన్న గాలిగోపురం వద్ద ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ తరచూ మరమ్మతులకు గురవుతోంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ఈ ఎస్కలేటర్ పట్టుమని 10-15 మెట్లు ఎక్కడానికి 5-10 నిమిషాలు పడుతోంది. ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో రాగా, ఎస్కలేటర్ చెడిపోవడంతో ఇబ్బంది తప్పలేదు. మరికొన్ని ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.