కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. మధ్యాహ్నం సెన్సెక్స్ 2,108.41 పాయింట్లు క్షీణించి 74,595.72 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 667.70 పాయింట్లు పతనమై 23,110.10 వద్ద కదలాడుతోంది.