'రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి'

NRML: భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కుంటాల మండలం ఓలా గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి రెవెన్యూ సదస్సులు చక్కటి అవకాశం అని పేర్కొన్నారు.