గంజాయి రవాణా కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

గంజాయి రవాణా కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

SDPT: బెజ్జంకి గ్రామ పరిసర ప్రాంతంలో గంజాయి సేవిస్తూ, విక్రయిస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులను స్థానిక పోలీసులు పట్టుకున్నట్లు ఏఎస్సై శంకర్ రావు తెలిపారు. ముత్తన్నపేట గ్రామానికి చెందిన కనగండ్ల అజయ్, ఇల్లంతకుంట మండలంలోని సోమవారం పేట గ్రామానికి చెందిన తడకపల్లి శేఖర్‌ను బెజ్జంకి పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.