రెండు బైక్‌లను ఢీకొన్న కారు

రెండు బైక్‌లను ఢీకొన్న కారు

కోనసీమ: ముమ్మిడివరం బైపాస్ రోడ్డు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లను కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బైక్‌లు నుజ్జు నుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని,దర్యాప్తు చేస్తున్నారు.