వెలగని హైమాస్ట్ లైట్లు.. వాహనదారుల ఇక్కట్లు
VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని కొడంగల్ చౌరస్తాలో హైమాస్ట్ లైట్లు వెలగకపోవడంతో గురువారం రాత్రి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చౌరస్తా అంతా చీకటిమయంగా మారడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే లైట్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు.