కొండగట్టు అంజన్న క్షేత్ర నూతన ఈవోగా రమాదేవి

కొండగట్టు అంజన్న క్షేత్ర నూతన ఈవోగా రమాదేవి

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం ఫుల్‌ఛార్జ్ EOగా రమాదేవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సామాన్య, వీఐపీ భక్తులను సమానంగా చూడాలని అధికారులకు సూచించారు. త్వరలోనే ఆలయంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభిస్తామని, భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.