రోలుగుంటలో కుటుంబ ప్రయోజనాల శిక్షణ
AKP: మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కుటుంబ ప్రయోజనాల నిర్వహణ విధానంపై శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, గ్రామ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి కుటుంబాన్ని ఒక్క యూనిట్‌గా గుర్తించి స్మార్ట్ కుటుంబ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఆధార్, రేషన్ అన్ని వివరాలను ఒకే కార్డులో భద్రపరచాలని సూచించారు.