మందుల కోసం వెళ్లి యువతి మిస్సింగ్

మందుల కోసం వెళ్లి యువతి మిస్సింగ్

NTR: మందుల కోసం వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కొత్తపేటలో వెలుగుచూసింది. స్థానిక ఎలక్ట్రికల్ షాపులో పనిచేసే జమున (22), ఈ నెల 14న కడుపునొప్పిగా ఉందని, టాబ్లెట్లు తెచ్చుకుంటానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి మంజు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.