శుక్రవారం సభలో పాల్గొన్న కలెక్టర్ పమేలా సత్పతి

శుక్రవారం సభలో పాల్గొన్న కలెక్టర్ పమేలా సత్పతి

KNR: రామడుగు మండలం వెలిచాల గ్రామపంచాయతీ భవనంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. శుక్రవారం సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం తదితర విషయాల పట్ల అవగాహన వస్తోందని అన్నారు. మహిళ తనతో పాటు తన పిల్లల పోషణ ఎలా ఉందో తెలుసుకోగలుగుతోందని అన్నారు.