పలమనేరు బైపాస్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరికి గాయాలు

పలమనేరు బైపాస్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరికి గాయాలు

CTR: పలమనేరు బైపాస్ రోడ్డుపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ఇద్దరు మైనర్లతో బైకుపై వస్తూ రోడ్డుపై ఉన్న వరిధాన్యం మూటలను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది