టీడీపీ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా

టీడీపీ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా

ప్రకాశం: టీడీపీ ప్రభుత్వ హయాంలో గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ రెడ్డి తెలిపారు. కంభం మండలంలోని పలు గ్రామాలలో శనివారం అశోక్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తనకు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గిద్దలూరును మరింత అభివృద్ధి చేస్తానన్నారు.