సూర్యబండ తండాలో అన్ని వార్డులు ఏకగ్రీవం
JN: నర్మెట మండలం సూర్యబండ తండా గ్రామ పంచాయతీలోని 8 వార్డులకు 3 వార్డులకు మొదటగా ఒక్కో నామినేషన్ దాఖలు కావడంతో ఏక గ్రీవమయ్యాయి. మిగిలిన 5 వార్డులకు 12 మంది నామినేషన్లు వేయగా అందులో కులం ధ్రువీకరణ పత్రం జత చేయని కారణంగా ఒకరు, మరో ఆరుగురు అభ్యర్థి స్థానంలో సాక్షి సంతకాలు చేయడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి.