బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
విశాఖ లైట్ హౌస్ బీచ్‌లో శనివారం ఇద్దరు విద్యార్థులు స్నానానికి దిగి అలల ధాటికి గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో మానేపల్లి తేజేశ్ (20) మృతదేహం ఆదివారం ఉదయం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మరో విద్యార్థి ఆదిత్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మెరైన్ సీఐ రమేష్ తెలిపారు. వీరు రాజమండ్రికి చెందిన ఆదిత్య, పార్వతీపురానికి చెందిన తేజస్‌గా పోలీసులు గుర్తించారు.