వ్యవసాయ కూలీకి రూ.40 లక్షల అదృష్టం

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఓ వ్యవసాయ కూలీని అదృష్టం వరించింది. రోజువారీ కూలీ పనికి వెళ్లిన అతనికి రూ.40 లక్షల విలువైన వజ్రం దొరికింది. వర్షాలు కురిసిన తర్వాత ఈ ప్రాంతంలోని పొలాల్లో వజ్రాలు దొరకడం మామూలే. ఈ సీజన్‌లో దొరికిన అత్యంత విలువైన వజ్రం ఇదేనని స్థానికులు చెబుతున్నారు. ఓ వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని రూ.40 లక్షలకు కొనుగోలు చేశారు.