కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన జూపల్లి
ADB: ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో కలిసి నిన్న భూమి పూజ చేశారు. కార్యాలయం ఏర్పాటుకు సొంత భూమిని ఇవ్వటం పట్ల శ్రీనివాసరెడ్డిని మంత్రి అభినందించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండే వ్యక్తి శ్రీనివాసరెడ్డి అని తెలిపారు.