రేపు మెగా ఫ్యామిలీ ఆత్మీయ సమావేశం

అనకాపల్లి: న్యూ కాలనీలోని రోటరీ కళ్యాణ మండపంలో ఈ నెల 18న మెగా ఫ్యామిలీ ఆత్మీయ సమావేశం జరగనుందని అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ ఉపాధ్యక్షుడు గల్లా కొండలరావు, రామ్‌చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మళ్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. విశాఖ ఉమ్మడి జిల్లా మెగా ఫ్యామిలీ అభిమానులు హాజరవ్వాలన్నారు.