22న జడ్పీ సర్వసభ్య సమావేశం
SKLM: జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 22న జరగనున్నట్లు జడ్పీ సీఈవో ఆర్. వెంకట రామన్ సోమవారం ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10.30కు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు.