వేదగిరిపై నేడు సింహవాహన సేవ

NLR: రూరల్ మండలం నరసింహ కొండ క్షేత్రంలో జరుగుతున్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం విశేష పూజలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు చప్పర ఉత్సవం, తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విశేష అలంకారంలో సింహవాహనంపై కొలువై భక్తులను అనుగ్రహించనున్నారు.