VIDEO: లో లెవెల్ వంతెనలపై పొంగిపొర్లుతున్న నీరు

KNR: శంకరపట్నంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి లో లెవెల్ వంతెనలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. అరకండ్ల బ్రిడ్జిపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మెట్‌పల్లి గ్రామంలో లో లెవెల్ వంతెనపై నుంచి భారీగా నీరు ప్రవహిస్తుండడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు హుజూరాబాద్ వైపు వెళ్లే ప్రజలు తెలిపారు.