కాకినాడ జిల్లాలో గంజాయి సాగు లేదు: డీఐజీ

KKD: జిల్లాలో గంజాయి సాగు లేదని ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ ఏరియల్ సర్వే ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని కూడా అశోక్ కుమార్ కోరారు.