'ఒకే గదిలో ఐదు తరగతులు'

'ఒకే గదిలో ఐదు తరగతులు'

NZB: ఇందల్వాయి మండలం గంగారం తండాలోని ఎంపీపీఎస్‌‌‌లో ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థలు తెలిపారు. అదనపు గది కేటాయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీ లేక పోవడం వల్ల పాములు వస్తున్నాయన్నారు. రాత్రిపూట పలువురు మద్యం తాగి బాటిళ్లను అక్కడే వదిలేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందిచి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.