బంపర్ ఆఫర్.. రూపాయికే అరకిలో చికెన్

బంపర్ ఆఫర్.. రూపాయికే అరకిలో చికెన్

AP: చికెన్ ప్రియులకు ఓ వ్యాపారి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు. పాత రూపాయి నోట్ ఇస్తే అరకిలో చికెన్ ఇస్తానని ప్రకటించాడు. విజయనగరం జిల్లా రాజాంలో చికెన్ షాప్ నిర్వాహకుడు ఈ ఆఫర్ ప్రకటించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.