VIDEO: సిబ్బంది లేక ఆసుపత్రి బయటే వ్యక్తి మృతి
KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. శరభవరానికి చెందిన సదరు వ్యక్తి చేబ్రోలు, గొల్లప్రోలులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, రాత్రి 3 గంటల సమయంలో నీరసంగా ఉండడంతో చేబ్రోలు ఆసుపత్రికి వచ్చాడు. ఆ సమయంలో లైట్లు వేసి ఉన్నా కానీ సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి బయటే మృతి చెందాడు.