VIDEO: మార్కాపురం ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు

ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇసుక వ్యాపారంలో ప్రజల నుంచి డబ్బు దోచుకుంటున్నారని లారీ అసోసియేషన్ సభ్యులు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం నిరసన తెలిపారు. టన్ను ఇసుకను రూ. 950కు కొనుగోలు చేసి, రూ. 1350కు ప్రజలకు అమ్ముతూ రూ. 450 వరకు దండుకుంటున్నారని ఆరోపించారు. తమకు గిట్టుబాటు ధర కల్పించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.