పల్లిపాలెంను ముంచెత్తిన వరద

కోనసీమ: గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వైనతేయ నది ఉప్పొంగడంతో అల్లవరం మండలం, బోడసకుర్రు గ్రామ పరిధిలోని పల్లిపాలెంను వరద నీరు ముంచెత్తింది. అధికారులు మరింత వరద పెరిగే అవకాశం ఉండటంతో స్థానికులను అప్రమత్తం చేసి, ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. వరద సహాయక చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.