సీతానగరం హైస్కూల్‌లో సంసాద్ ఖేల్ మహోత్సవం ప్రారంభం
E.G: అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా సీతానగరం హైస్కూల్‌లో సంసాద్ ఖేల్ మహోత్సవం ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి క్రీడాకారులను అభినందించారు. క్రీడలు విద్యార్థుల్లో ప్రతిభ, ఆరోగ్యం, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.