వీధి కుక్కల దాడి.. బాలికకు తీవ్ర గాయాలు
MHBD: గార్ల మండలంలోని సరిహద్దు తండాకు చెందిన భూక్యా హేమశ్రీ (2) అనే బాలిక మంగళవారం ఇంటిముందు ఆడుకుంటుండగా, వీధి కుక్కలు దాడి చేశాయి. గమనించిన తల్లిదండ్రులు బాలికను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.