కరెంట్ షాక్‌తో పూజారి మృతి

కరెంట్ షాక్‌తో పూజారి మృతి

NLR: కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం పెన్నా కరకట్టపై ఉన్న శ్రీ పెన్నేశ్వర శివాలయం పూజారి దువ్వూరు కృష్ణయ్య (71) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మంగళవారం మృతి చెందారు. కోవూరు రాళ్ల మిట్టలోని తన ఇంట్లో ఫ్యాన్ వైర్లను ప్లగ్‌లో పెట్టగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. గమనించిన కుమారుడు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.