'హెల్త్ వీక్'పై టాస్క్ ఫోర్స్ సమావేశం

'హెల్త్ వీక్'పై టాస్క్ ఫోర్స్ సమావేశం

SRD: సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో 'హెల్త్ వీక్' (ఏప్రిల్ 6-11) కార్యక్రమాలపై టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించేలా ర్యాలీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఆహార భద్రత, సురక్షిత మాతృత్వం, ఎయిడ్స్ నివారణ, హోమియోపతి, ఔషధ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.