ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

KHM: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతులకు భవన నిర్మాణ కార్మిక (మేస్త్రి) పని, నర్సరీ మేనేజ్మెంట్, మొబైల్ రిపేరింగ్ పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 30రోజుల శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.