VIDEO: రైల్వే గేట్‌లో సాంకేతిక లోపం.. రాకపోకలకు అంతరాయం
ATP: గుంతకల్లు పట్టణ శివారులో హనుమాన్ సర్కిల్ లో ఉన్న రైల్వే గేట్ మంగళవారం సాంకేతిక లోపం కారణంగా లాక్ కావడంతో సుమారు అరగంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు లాక్ పడిన రైల్వే గేట్‌కు మరమ్మతు పనులు చేపట్టారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.