VIDEO: అమెరికాలో సీతారామ కళ్యాణం
MHBD: మరిపెడకు చెందిన అమెరికా ప్రవాసులు న్యూజెర్సీలో శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, భక్త రామదాసు కీర్తనలు, హారతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సీతారాముల కళ్యాణాన్ని భక్తులు భక్తిపారవశ్యంతో వీక్షించారు. మరిపెడ వాసులంతా కలిసి నిర్వహించిన ఈ వేడుక న్యూజెర్సీలో అయోధ్యను తలపించేలా సాగింది.