మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు

మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు

విజయనగరం జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ వాహనదారులను హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. అటువంటి వాహనాలను కట్టడికి రోజు నిఘా పెడుతున్నామని పేర్కొన్నారు.