ముగిసిన ఎన్నికల ప్రచారం.. అభ్యర్థుల్లో టెన్షన్
NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారం ఆగిపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగింది. గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ సహా ఆరు మండలాల్లోని 150 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం మధ్యాహ్నం ఫలితాలు ప్రకటిస్తారు.