ప్రగతి నగర్‌లో పెట్రోల్ దాడి కలకలం
మహబూబాబాద్ పట్టణంలోని ప్రగతి నగర్‌లో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి తనపై పెట్రోల్ పోసుకుని, తనతో పాటు ప్రియురాలిపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.