VIDEO: భారీ మొసలి ప్రత్యక్షం

VIDEO: భారీ మొసలి ప్రత్యక్షం

SRD: వట్పల్లి మండలంలోని కేరళ గ్రామంలో శనివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రధాన రహదారిపై భారీ మొసలి ప్రత్యక్షమైంది. అటువైపుగా వెళ్తున్న స్థానికులు మొసలిని గుర్తించి భయాందోళనతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు దానిని సురక్షితంగా మంజీరా డ్యామ్‌లో వదిలేసినట్లు తెలిపారు.