గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్.. చెలరేగిన మంటలు
నంద్యాల మండలం చాబోలు గ్రామంలో గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీలో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ట్రాలీ లిఫ్ట్ చేసి గడ్డిని రోడ్డుపై వదిలేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడిన గడ్డి కుప్పలకు మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు.