ఆలయంలో ఘనంగా ఉగాది సంబరాలు
VKB: తాండూరు గ్రామీణ పరిధిలోని అయ్యప్పస్వామి ఆలయంలో గురువారం ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని రంగురంగుల పుష్పాలతో కనువిందుగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది.