'విద్యాశాఖకు శామ్యూల్ పాల్ విశేష గుర్తింపు తెచ్చారు’
కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ విద్యాశాఖకు విశేష గుర్తింపు తీసుకువచ్చారని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం గౌరవాధ్యక్షుడు ఓంకార్ యాదవ్ అన్నారు. శుక్రవారం డీఈవోగా రిలీవ్ అయిన శామ్యూల్ పాల్కు ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. మెగా డీఎస్సీని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన ఘనత శామ్యూల్ పాల్కే దక్కుతుందన్నారు.